చారిత్రక కట్టడాలను కాపాడాలి : కలెక్టర్ సంతోష్ 

చారిత్రక కట్టడాలను కాపాడాలి : కలెక్టర్ సంతోష్ 

గద్వాల, వెలుగు: చారిత్రక కట్టడాలను కాపాడి భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ సంతోష్ అన్నారు. మంగళవారం గద్వాల టౌన్ లో ఉన్న గద్వాల కోట లింగంబావిని ఆర్కిటెక్స్ తో కలిసి పరిశీలించారు. గద్వాల కోట, లింగం బావిలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చేపట్టాల్సిన పనులపై డీపీఆర్ రెడీ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న స్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌కు  ఎలాంటి డ్యామేజ్ కలగకుండా బావితోపాటు కోట సుందరీకరణ, ల్యాండ్ స్కేపింగ్ చేసి అన్ని హంగులతో దాన్ని డెవలప్ మెంట్  చేయాలని సూచించారు.

 ఎల్ఆర్ఎస్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో 2020 ఆగస్టు 26వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలిస్తామన్నారు. జిల్లాలో 46 వేల దరఖాస్తులు స్వీకరించామన్నారు.  కేవలం 162కు  మాత్రమే ఫీజు  కట్టారన్నారు.  డీపీఓ నాగేంద్రం తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దశరథం, ఆర్కిటెక్ శ్రీలేఖ తదితరులున్నారు.

నీట్ ఎగ్జామ్స్ కట్టుదిట్టమైన భద్రత

నీట్ ఎగ్జామ్స్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. నీట్ ఎగ్జామ్స్ సెంటర్లైన ఎస్సార్ విద్యానికేతన్ గద్వాల, ఎర్రవల్లి లోని సరస్వతి స్కూల్ ను  మంగళవారం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తో  కలిసి పరిశీలించారు. 2025 మే 24న జరిగే ఎగ్జామ్స్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రూల్స్ ప్రకారం నిర్వహించాలని నిర్వాహకులను ఆదేశించారు.